2016లో సంక్రాంతి ‘కానుకగా విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అత్యధిక వసూళ్లను సాధించి నాగార్జున కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గానిలిచింది . ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘బంగార్రాజు’ సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 14న ఈ సినిమా విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో దీన్ని రూపొందించారు. సంక్రాంతి వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడంతో ‘బంగార్రాజు’కి అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ క్రమంలో తొలిరోజే ఈ సినిమా అన్ని ప్రాంతాలతో పాటు నైజాం, సీడెడ్ లో మంచి కలెక్షన్స్ ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నేలంజాలో తొలిరోజున ఈ సినిమా రూ.3.1 కోట్ల గ్రాస్ ను, 1.73 కోట్ల షేర్ ను రాబట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో.. యాభై శాతం ఆక్యుపెన్సీతో ఈమాత్రం కలెక్షన్స్ సాధించడం విశేషమనే చెబుతున్నారు విశ్లేషకులు. అలానే ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఓవర్సీస్ లో ఈ సినిమా ఓ మోస్తరు కలెక్షన్స్ ను రాబట్టింది. ప్రీమియర్ల ద్వారా 40 వేల డాలర్లు వసూలు చేసింది. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత . రిలీజ్ కి ముందు ఈ సినిమా రూ.39 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రలు పోషించగా.. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా కనిపించారు.