‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయ్యింది.కాస్త రొటీన్ గా అనిపించినా మొత్తానికి బాగానే ఉంది అనే టాక్ ను ఈ సినిమా సంపాదించుకుంది.
కలెక్షన్ల పరంగా కూడా అటు నాగార్జున కెరీర్ లో ఇటు నాగ చైతన్య కెరీర్ బెస్ట్ అనిపిస్తుంది. మొదటి రోజు కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం
2.05 cr
సీడెడ్
1.75 cr
ఉత్తరాంధ్ర
1.25 cr
ఈస్ట్
0.76 cr
వెస్ట్
0.65 cr
గుంటూరు
0.95 cr
కృష్ణా
0.46 cr
నెల్లూరు
0.40 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
8.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
9.37 cr
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రానికి రూ.9.37 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.29.63 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చిన్న సినిమాలు పెద్దగా ఈ చిత్రానికి పోటీని ఇవ్వలేకపొతున్నాయి. కాబట్టి పండుగ హాలిడేస్ ను కరెక్ట్ గా వాడుకుంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను reach అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.