ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలు పోటీ నుంచి తప్పుకోవడంతో బంగార్రాజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు కావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో బంగార్రాజు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. పండుగకు కుటుంబంతో కలిసి సినిమా చూడాలని అనుకునే వాళ్లకు బంగార్రాజు మూవీ బెస్ట్ ఛాయిస్ అవుతుందని చెప్పవచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
సోగ్గాడే చిన్నినాయన సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కుతుండగా బంగార్రాజు రిలీజైన రెండు వారాలకు జీ స్టూడియోస్ లో స్ట్రీమింగ్ అవుతుందని ఫేక్ వార్తను ఒక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ గురించి జీ స్టూడియోస్ సంస్థ స్పందిస్తూ బంగార్రాజు సినిమా గురించి వైరల్ అవుతున్న రూమర్లను అస్సలు నమ్మవద్దని కోరింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నామని ఈ సంస్థ తెలిపింది.
జీ స్టూడియోస్ క్లారిటీతో బంగార్రాజు గురించి వైరల్ అవుతున్న ఫేక్ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. నాగచైతన్య, కృతిశెట్టి ఖాతాలో బంగార్రాజు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాగ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఇప్పటికే రిలీజైన బంగార్రాజు టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!