Nagarjuna: ఇంత పకడ్బందీ ప్లానింగ్‌ మిగతా దర్శకులు చేస్తేనా?

  • November 10, 2021 / 01:08 PM IST

సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేయాలంటే అంత ఈజీనా… దానికి చాలా ప్లానింగ్‌ అవసరం, బౌండెడ్‌ స్క్రిప్ట్‌ కావాలి, స్టార్లు, నటుల డేట్స్‌ పక్కగా ప్లాన్‌ చేసుకోవాలి. అందులో మల్టీస్టారర్‌ అయితే హీరోలు, హీరోయిన్లు డేట్లు క్లాష్‌ కాకుండా జాగ్రత్త పడాలి. కానీ పక్కాగా ప్లానింగ్‌ చేసుకుంటే అదేమంత కష్టం కాదు. దీనిని ఇప్పుడు చేసి చూపిస్తున్నాడు యువ దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ. ‘బంగార్రాజు’ సినిమా కోసమే ఇదంతా. నిజానికి ‘బంగార్రాజు’ సినిమా గురించి నాలుగేళ్ల క్రితమే ప్రకటించారు.

‘సోగ్గాడే చిన్నినాయన’కు ప్రీక్వెల్‌ అని తొలినాళ్లలో చెప్పారు కానీ… ఆ తర్వాత ఎప్పుడూ ఆ ఊసు రాలేదు. ప్రముఖ స్క్రిప్ట్‌రైటర్‌ సత్యానంద్‌తో కలసి కల్యాణ్‌కృష్ణ నాలుగేళ్ల నుండి ఈ కథ మీద కుస్తీ పడుతున్నారు. ఎట్టకేలకు ఇటీవల ఓకే అయ్యి… పట్టాలెక్కించారు. అంతేకాదు వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేద్దాం అంటున్నారు. అన్నీ వీలైతే 2022 పొంగల్‌కు ‘బంగార్రాజు’ను తెస్తారు అని టాక్‌. అయితే నాలుగేళ్లు కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌ నాలుగు నెలల్లో ఎలా తీస్తాడు అనేది ఆసక్తికరం.

కానీ నాలుగేళ్ల పడ్డ కష్టం వీలైనంత త్వరగా తెరపై చూసుకోవాలి అనుకోవడం కూడా ఆలోచించాల్సిన విషయమే. స్క్రిప్టు పక్కాగా చేసుకోవడం, స్టోరీ బోర్డ్, షెడ్యూల్స్ పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌… వల్ల సినిమా వేగంగా పూర్తవుతోందని టాక్‌.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus