ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న “పులి వచ్చింది మేక సచ్చింది” సినిమా, పెరుగుతున్న థియేటర్లు

  • December 20, 2021 / 04:31 PM IST

ఇటీవలే థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పులి వచ్చింది మేక సచ్చింది’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచపు తొలి 360 డిగ్రీల చిత్రంగా రిలీజైన ఈ సినిమా సరికొత్త స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటోంది. ప్రస్థానం మార్క్స్ పతాకంపై నిర్మాత భవానీ శంకర్ కొండోజు నిర్మాణంలో అ శేఖర్ యాదవ్ ‘పులి వచ్చింది మేక సచ్చింది’ సినిమాను రూపొందించారు.

జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘పులి వచ్చింది మేక సచ్చింది’ సినిమా ఈ నెల 17న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు రిలీజైంది. మొదటి రోజు థియేటర్ లు ఎక్కువగా దొరకకున్నా, సినిమా బాగుందనే మౌత్ టాక్ తో థియేటర్ సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు దర్శకుడు అ శేఖర్ యాదవ్. కొత్త తరహా సినిమా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే మాట తమ సినిమా విషయంలో నిజమైందని ఆయన అంటున్నారు.

యోగి, వర్ష, మను, ఆ శేఖర్ యాదవ్, చందు, సుజిత్, శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – సుభాష్ ఇషాన్, డైలాగ్స్ – నాత్మిక, సినిమాటోగ్రఫీ – కిరణ్ కుమార్ దీకొండ, ఎడిటర్ – శ్రీనివాస్ అన్నవరపు, ఆర్ట్ – అడ్డాల పెద్దిరాజు, కాస్ట్యూమ్స్ – సండ్ర శ్రీధర్, ఆడియోగ్రఫీ – రంగరాజు, సౌండ్ డిజైన్ – రఘునాథ్ కామిశెట్టి, సౌండ్ ఎఫెక్ట్స్ – యతిరాజ్, నిర్మాత – భవానీ శంకర్ కొండోజు, రచన – దర్శకత్వం – శేఖర్ యాదవ్

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus