Beast Movie: ‘బీస్ట్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • April 13, 2022 / 05:01 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’.. ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించాడు. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధిమారన్ఈ చిత్రాన్ని నిర్మించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. విజయ్ గత చిత్రం ‘మాస్టర్’ కి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. తెలుగు బయ్యర్స్ కు లాభాల్ని అందించి సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది.

Click Here To Watch Trailer

దానికి తోడు దర్శకుడు నెల్సన్ గత చిత్రం ‘డాక్టర్’ తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ‘బీస్ట్’ పై మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తెలుగులో ఈ మూవీకి మంచి బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాల్ని గమనిస్తే :

నైజాం 3.30 cr
సీడెడ్ 2.00 cr
ఉత్తరాంధ్ర 1.80 cr
ఈస్ట్ 0.75 cr
వెస్ట్ 0.70 cr
గుంటూరు 0.88 cr
కృష్ణా 0.80 cr
నెల్లూరు 0.45 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.68 cr

‘బీస్ట్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. విజయ్ గత చిత్రం ‘మాస్టర్’ రూ.15 కోట్ల దాకా షేర్ ను రాబట్టింది. టాక్ బాగుంటే ‘బీస్ట్’ కు ఓపెనింగ్స్ బాగా జరుగుతాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అదిరిపోయాయి. అయితే ‘బీస్ట్’ రిలీజ్ అయిన ఒకరోజు తర్వాత ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కూడా రిలీజ్ కాబోతుంది. ఆ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ సినిమా వీకెండ్ పూర్తయ్యేవరకు భారీగా కలెక్ట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. మరి ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ పోటీని ‘బీస్ట్’ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus