Vijay, Mahesh Babu: ‘బీస్ట్’ లో మహేష్ డైలాగులు.. దర్శకుడు ప్లాన్ ఫెయిల్…!

  • April 13, 2022 / 05:35 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఏప్రిల్ 13న అంటే ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వస్తుంది. తమిళ్ లో ఎలా ఉన్నా తెలుగులో అయితే ఈ చిత్రానికి ముందు నుండీ మంచి బజ్ ఉంది. ఇంకో విడ్డూరం ఏంటి అంటే తమిళ్ లో కంటే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో ‘బీస్ట్’ కు ఎక్కువ టికెట్ రేట్లు ఉన్నాయి.

Click Here To Watch Trailer

విజయ్ గత చిత్రం ‘మాస్టర్’ కూడా తెలుగులో బాగా కలెక్ట్ చేసింది. ఆ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఇక్కడి బయ్యర్స్ కు లాభాల్ని తెచ్చిపెట్టింది. పైగా బీస్ట్ ఫస్ట్ సింగిల్ అయిన ‘అరబిక్ కుత్తు’ కూడా చార్ట్ బస్టర్ అవ్వడం, ‘బీస్ట్’ దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన ‘డాక్టర్’ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ‘బీస్ట్’ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో విజయ్ నటన మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని పోలి ఉందని అంతా అంటున్నారు.

విజయ్ మన మహేష్ నటన్ని కాపీ కొట్టేసాడనే కామెంట్లు కూడా ఎక్కువయ్యాయి. ఇవి రావడానికి కారణం కూడా లేకపోలేదు. దర్శకుడు నెల్సన్ మహేష్ కు ఓ కథ వినిపించాడు. ‘డాక్టర్’ మూవీ మహేష్ కు బాగా నచ్చింది. ప్రస్తుతం మహేష్ బిజీగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో అయితే నెల్సన్ కు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని మహేష్ సన్నిహితులు చెప్పుకొచ్చారు. కాబట్టి ‘బీస్ట్’ లో మహేష్ యాక్టింగ్ ను విజయ్ తో చేయించినట్టు అంతా అనుకుంటున్నారు.

‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనే డైలాగ్ ను బీస్ట్ లో విజయ్ రెండు, మూడు సార్లు వాడతాడు. దాంతో ఇప్పుడు డిస్కషన్లు ఎక్కువయ్యాయి. ‘బీస్ట్’ రిజల్ట్ తో దర్శకుడు నెల్సన్ ప్లాన్ కూడా ఫెయిల్ అయినట్టే. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. మహేష్ ‘పోకిరి’ ని విజయ్ హీరోగా తమిళ్ లో రీమేక్ అయ్యింది.

‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనే తమిళ డైలాగ్ అక్కడ కూడా ఉంటుంది.కాబట్టి విజయ్… తన డైలాగ్ ను తనే కాపీ కొట్టుకున్నాడు అని కొందరు విశ్లేషిస్తున్నారు. అది కూడా నిజమే..!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus