Beast vs Annaatthe: బీస్ట్‌ వర్సెస్‌ అన్నాత్తే… కోలీవుడ్‌లో వార్‌ షురూ.. తలైవా మాటలు అర్థం చేసుకోలేదా?

ఎవరో ఊరు పేరు తెలియని వ్యక్తి ట్విటర్‌లో ఏదో రాస్తే… ఆ మాటను తీసుకొని కాలర్లు పట్టుకునే అభిమానులు ఉన్న రోజులివి. వాడెవడు, ఎందుకన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, అసలు అన్నాడా లేదా అనే విషయాల్ని కూడా పక్కనపెట్టేసి మరీ గొడవలు పడతారు. అందులో కారణం ఏమైనా ఉంటుందా అంటే… తమ అభిమాన హీరో సినిమానో, హీరోనో ఏదో మాట అని ఉంటాడు అంతే. ఇదంతా ఓ అభిమాని అంటేనే జరుగుతున్న పంచాయతి. అలాంటిది ఈ మాట ఓ స్టార్‌ హీరోనే అంటే.. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి.

కోలీవుడ్‌ సినిమాలను, అక్కడి హీరోల మాటల్ని ఫాలో అవుతుంటే.. ఇప్పటికే మేం ఏ హీరోల గురించి, ఏ సినిమాల గురించి మాట్లాడుతున్నామో మీకు అర్థమైపోయుంటుంది. ఒకవేళ ఫాలో కానివాళ్లకు అయితే ఆ హీరోలు రజనీకాంత్‌, విజయ్‌. ఆ సినిమాలు ‘బీస్ట్‌’, ‘అన్నాత్తే’. ఇటీవల ‘జైలర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా రజనీకాంత్‌ ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ ‘బీస్ట్‌’ సినిమా ఫలితం గురించి మాట్లాడారు. ఆ సినిమాకు సరైన విజయం దక్కలేదు అనే యాంగిల్‌లో కామెంట్‌ చేశారు. అయితే ఆ సినిమాకు లాభాలు వచ్చాయి అని మాత్రం చెప్పారు.

అయితే, ఇప్పుడు విజయ్‌ అభిమానులు మాత్రం రజనీకాంత్‌ చెప్పిన మాటల్లో సగం మాత్రమే తీసుకొని నానా రచ్చ చే్తున్నారు. ఇన్నాళ్లూ ‘బీస్ట్‌’ సినిమాను ఇష్టపడని విజయ్‌ అభిమానులు కూడా ఇప్పుడు ఆ సినిమా గొప్ప విజయం సాధించింది అనేలా మాట్లాడేస్తున్నారు. మా హీరో సినిమాను రజనీకాంత్‌ అలా అనడం సరికాదు అంటూ నీతి వాక్యాలు చెబుతున్నారు. గతంలో ఆ సినిమాను విజయ్‌ తండ్రి బాగోలేదు అని అన్న మాటను మరచిపోయి మరీ ఇప్పుడు తలైవాను అనేస్తున్నారు.

మరికొందరు ఫ్యాన్స్‌ అయితే రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ (Annaatthe) సినిమా ఫలితం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ సినిమా బాగా ఆడలేదని గుర్తు చేస్తున్నారు. ఈ సినిమా హిట్‌ అని ఎవరూ అనకపోయినా ఆ సినిమా ప్రస్తావన తీసుకొస్తున్నారు. మరికొందరైతే ‘జైలర్‌’ వస్తుంది కదా చూద్దాం అనే రేంజిలో మాట్లాడుతున్నారు. దీనికి రజనీ అభిమానుల నుండి అదే మోతాదులో స్పందన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో చిన్నపాటి ఫ్యాన్‌ వార్‌ మొదలైంది అని చెప్పొచ్చు. మరి దీని ముగింపునకు హీరోలు ఏమన్నా పిలుపు ఇస్తారేమో చూడాలి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus