అందాల పోటీల్లో చివరి వరకు వెళ్లింది ఆ ముద్దు గుమ్మ. అయితే ఇప్పుడు లోకల్ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోబోతోంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా. కానీ ఇది జరుగుతోంది అయితే ఇక్కడ కాదు… ఉత్తర్ ప్రదేశ్‌లో. యూపీలో త్వరలో పంచాయతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ‘లోకల్ ఎలక్షన్‌లో అందాల రాణి’ అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా అందాల రాణి.. ఏంటా కథ చూద్దామా?
ఉత్తరప్రదేశ్‌లో ని జాన్‌పూర్ జిల్లా బక్షా డెవపల్‌పెంట్ బ్లాక్ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. 26వ వార్డు నుండి మోడల్, అందాల రాణి దీక్షా సింగ్ బరిలోకి దిగుతున్నారు. 2015 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్ దీక్షా సింగ్. ఆ పోటీల్లో చివరి అంశంలో ఓడిపోయాక ప్రైవేటు ఆల్బమ్స్‌తో బిజీ అయ్యింది. దాంతో పాటు కొన్ని ప్రకటనల్లో నటించింది. అయితే తన తండ్రి కోరిక కారణంగా ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతోంది.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి దీక్ష తండ్రి జితేంద్ర సింగ్ చాలా రోజుల నుండి రెడీ అవుతున్నారు. అయితే తాజాగా ఈ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో … ఆయన తన కూతురు దీక్షను బరిలోకి దించుతున్నారు. దీక్ష స్వస్థలం బక్ష ప్రాంతంలోని చిట్టోరి. అయితే వ్యాపార రీత్యా కుటుంబం గోవాలో స్థిరపడింది. గోవా, రాజస్థాన్‌లో ఆమె తండ్రి జితేంద్ర ట్రాన్స్‌పోర్టు బిజినెస్ నిర్వహిస్తున్నారు. ఆ అందాల తార కొన్ని ఫొటోలు చూద్దామా!