Bedurulanka 2012 OTT: ఓటీటీకి వచ్చేసిన బెదురులంక 2012.. ఎందులో అంటే?

ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. కాబట్టి ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్లపైనే అందరి దృష్టి ఉంది. దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతలో సడన్ గా మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే బెదురులంక 2012.’ఆర్.ఎక్స్.100 ‘ ఫేమ్ కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీని నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించాడు.

‘లౌక్య ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించగా.. సి.యువరాజ్ సమర్పకులుగా వ్యవహరించారు. ఆగస్టు 25 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షో తోనే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక ఈరోజు నుండీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 2012 టైమ్లో యుగాంతం వస్తుంది అని ప్రచారం జరిగింది. ఆ వార్తలను అడ్డం పెట్టుకుని ముగ్గురు పెద్దలు ఆ ఊరి ప్రజలని మోసం చేసి వాళ్ల డబ్బు, నగలు ఎలా అక్రమంగా దోచుకున్నారు, ఆ టామ్ లో హీరో వాళ్ల ఎత్తులు పసిగట్టి… ఊరి జనాలకి ఎలా సాయపడ్డాడు అనేది కథ. చివరి 40 నిమిషాలు కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus