Rajamouli, Mahesh Babu: ఆ స్టార్ డైరెక్టర్ కు మహేష్ ఓకే చెప్పారా.. జక్కన్న మూవీ ఆలస్యం కానుందా?

మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా పూర్తైన తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో నటించాల్సి ఉంది. అయితే ఆ సినిమాకు బదులుగా మహేష్ బాబు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలను తెరకెక్కించే దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు కాగా మహేష్ అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. మరోవైపు భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి కొత్త సినిమాలేవీ ప్రకటించలేదు. మహేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మరో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ అంతకంతకూ ఆలస్యమైతే ఫ్యాన్స్ నిరాశకు గురయ్యే ఛాన్స్ ఉంది.

రాజమౌళి (Rajamouli) ఇప్పటికే ఈ సినిమాను లేట్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. మహేష్ బాబు సినిమాల లెక్కలు మారతాయో లేదో తెలియాలంటే క్లారిటీ రావాల్సి ఉంది. మహేష్ బాబు కొత్త సినిమాలను ప్రకటిస్తారో లేదో తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేశ్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.

మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. మహేష్ బాబు తన సినిమాలలో ఇతర భాషల నటులు కూడా నటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus