ఆది…బోయపాటిని కాదన్నాడా???

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన రవిరాజా పినిశెట్టి కుమారుడే ఆది పినిశెట్టి. టాలీవుడ్ లో ఒక విచిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యువ హీరో అర కొరా సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు. అయితే టాలీవుడ్ లో, తెలుగు ప్రేక్షకుల్లో ఈ హీరోనూ పెద్దగా అభిమానించే వారు ఎవ్వరూ లేకపోయినా, తమిళ్ లో మాత్రం ఈ హీరో కు మంచి డిమాండ్ ఉంది. ఇదిలా ఉంటే తనదైన మార్క్ టేకింగ్ తో బోయపాటి సంధించిన మాస్ ఆయుధం సరైనోడు. ఈ సినిమాలో ఆది ని విలన్ గా మార్చాడు మన దర్శకుడు.

అయితే ఈ సినిమాలో ఆది యాక్టింగ్ కి మంచి పేరు వచ్చింది. ఈ విషయంలో స్వయంగా చిరంజీవి సైతం ఆది పినిశెట్టి కి ఫోన్ చేసిన మరీ కంగ్రాట్స్ చెప్పటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఆది చేసిన విలన్ పాత్రకి మంచి పేరు వస్తుంది అని దర్శకుడు ముందే ఊహించాడంటా…అదే క్రమంలో బోయపాటి తరవాత మూవీలోనూ ఆది పినిశెట్టి విలన్ గా నటించాలని, ఆది నుండి మాట తీసుకున్నాడు. దానికి ఆది కూడా ముందు ఒప్పుకున్నాడు. కానీ ప్రస్తుతం సరైనోడు మూవీ పై ప్రేక్షకుల్లో మిక్స్డ్ టాక్ రావటంతో… ఆది పినిశెట్టి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే…ఈ మూవీ ద్వార మంచి పేరు వచ్చినప్పటికీ…బోయపాటి మూవీల్లో నటిస్తే..అందరూ విలన్ గానే ముద్రను వేస్తారని ఆది పినిశెట్టి భావించాడంట. అందుకే బోయపాటి చిత్రాల్లో నటించే ఉద్దేశం లేదని స్పష్టంగా ఆది పినిశెట్టి చెప్పుకొచ్చినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని ఆది సినిమా విడుదలకు ముందే బోయపాటికి చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా…విలన్ గా సైతం ఆదికి మంచి భవిష్యత్తు ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags