Bellamkonda Ganesh: ‘స్వాతి ముత్యం’ రిజల్ట్ పై హీరో గణేష్ కామెంట్స్ వైరల్..!

బెల్లంకొండ సురేష్ తనయుడు.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు అయిన బెల్లంకొండ గణేష్.. ‘స్వాతి ముత్యం’ చిత్రంతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు.2022 అక్టోబర్ 5న దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. సినిమాకి చాలా మంచి టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉ న్నాయి.

కానీ ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. దీంతో గణేష్ (Bellamkonda Ganesh) మొదటి సినిమా.. ప్లాప్ మూవీగా నిలిచిపోయినట్టైంది. తాజాగా ‘స్వాతి ముత్యం’ ఫలితం పై బెల్లంకొండ గణేష్ స్పందించాడు. తన ‘నేను స్టూడెంట్ సర్’ సినిమా ప్రమోషన్స్ లో తన మొదటి సినిమా ఫలితంపై గణేష్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. అతను మాట్లాడుతూ.. ” ‘స్వాతి ముత్యం’ సినిమాకి చాలా మంచి టాక్ వచ్చింది. కానీ థియేటర్లలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

దానికి ప్రధాన కారణం.. బ్యాడ్ రిలీజ్ డేట్ అని చెప్పాలి. ఒక పక్క చిరంజీవి గారి సినిమా, మరోపక్క నాగార్జున గారి సినిమా రిలీజ్ అయిన రోజు ‘స్వాతి ముత్యం’ రిలీజ్ అయ్యింది. అందువల్ల ‘స్వాతి ముత్యం’ ని ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. ‘మనది ఫ్యామిలీ సినిమా.. మొదటి రోజు తక్కువ వచ్చినా మన సినిమా నిలబడుతుంది’ అంటూ నిర్మాత పెద్ద సినిమాల నడుమ విడుదల చేశారు. అందువల్ల రిజల్ట్ మేము అనుకున్నట్టు రాలేదు.

కానీ ఆ సినిమాని ఓటీటీలో జనాలు బాగానే చూశారు. నేను ఒకసారి ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్తే.. అక్కడ కొంతమంది లేడీస్ తమ పిల్లలతో వచ్చి ‘మంచి సినిమా తీశారు’ అంటూ నాతో ఫోటోలు దిగారు. ఆ సినిమా మంచి రిలీజ్ డేట్ కి వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది” అంటూ సాయి గణేష్ చెప్పుకొచ్చాడు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus