బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు కూడా అదరకొట్టేలా ఉన్నాడుగా.. ఫస్ట్ లుక్ అదుర్స్..!

  • September 14, 2020 / 03:19 PM IST

టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న బెల్లంకొండ సురేష్.. ఇప్పటికే తన పెద్ద కొడుకుని హీరోగా పరిచయం చేసి అతన్ని సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ‘అల్లుడు శీను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా సినిమాకి తన ఇమేజ్ ను పెంచుకుంటూ ‘రాక్షసుడు’ చిత్రంతో మంచి క్రేజీ హీరోగా ఎదిగాడు. అతని సినిమాలు ఇక్కడ మాత్రమే కాదు బాలీవుడ్లో కూడా అదరకొడుతున్నాయి. ఇప్పుడు అతని తమ్ముడు, బెల్లంకొండ సురేష్ గారి రెండో కుమారుడు అయిన గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి .

‘ప్రేమ ఇష్క్ కాదల్’ మరియు ‘సావిత్రి’ వంటి చిత్రాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే 50శాతం షూటింగ్ పూర్తిచేసుకోగా.. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం బ్యాలన్స్ షూటింగ్ వాయిదా పడింది. వచ్చే నెల నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు హీరో బెల్లంకొండ గణేష్ పుట్టినరోజు కావడంతో అతనికి సంబంధించి రెండు కొత్త లుక్స్ ను విడుదల చేశారు.

ఈ లుక్స్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కచ్చితంగా గణేష్ కూడా సక్సెస్ ఫుల్ గా హీరోగా ఎదుగుతాడంటూ కొందరు నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గణేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు .. హీరోగా రాణించాలని వారు బెస్ట్ విషెష్ కూడా చెబుతుండడం విశేషం.

1

2

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus