Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ కూడా గతంలోకి వెళ్తున్నారు.. అలాంటి కథతో కొత్త సినిమా?

మూడేళ్ల క్రితం ‘అల్లుడు అదుర్స్‌’ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) నుండి కొత్త సినిమా ఏమీ రాలేదు. అదేంటి ‘ఛత్రపతి’ వచ్చింది కదా? అంటారా? అది తెలుగు సినిమా కాదు, అలా అని బాలీవుడ్‌ సినిమా అందాం అంటే అక్కడి జనాలు పట్టించుకోలేదు. ఆ లెక్కన బెల్లంకొండ పెద్ద హీరో సినిమా వచ్చి మూడేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాలను వేగంగా సిద్ధం చేసి, వెంటనే వెంటనే ఓకే చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో మరో కొత్త సినిమా అనౌన్స్‌ చేశాడు.

లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna ) 75వ జయంతి సందర్భంగా ఇటలీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కొత్త సినిమాను ప్రకటించారు. బీఎస్‌ఎస్‌ 12వ సినిమాగా తెరకెక్కున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు లుధీర్‌ బైరెడ్డి డైరెక్ట్‌ చేస్తారు. మహేశ్‌ చందు నిర్మిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశారు. ఓ పురాతన గుడి ఎదురుగా తుపాకీ పట్టుకుని నిల్చొని ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఆ ఫొటోలో ఉన్నాడు. మొత్తంగా పోస్టర్‌ తీరు ఆసక్తికరంగా ఉంది.

ఇక ఈ సినిమా కథ సంగతి చూస్తే.. 400 ఏళ్ల నాటి పురాతన దేవాలయం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తాంత్రిక అంశాలు కూడా ఈ సినిమాలో ఉండటంతో థ్రిల్లర్‌ జోనర్‌లో ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ గతంలో ఎప్పుడూ చేయని శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నాడట. అన్నట్లు సినిమా షూటింగ్‌ కూడా ఇప్పటికే మొదలైందట. ఇప్పుడు జరుగుతున్నది రెండో షెడ్యూల్‌ అని టీమ్‌ చెప్పింది.

ఇక సాయి శ్రీనివాస్‌ ‘టైసన్‌ నాయుడు’ (Tyson Naidu) అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. సాగర్‌ కే చంద్ర (Saagar K. Chandra) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సాయి శ్రీనివాస్‌కు 10వది. ఇక 11వ సినిమా మరొకటి ఉంది. ఈ లెక్కన బెల్లంకొండ వారి హీరో వరుస సినిమాలు పట్టాలెక్కంచి భారీ ప్లానే వేశాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus