బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మొదటి చిత్రంతోనే ఓ రేంజ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఓ స్టార్ హీరోయిన్.. స్టార్ డైరెక్టర్ భారీ బడ్జెట్.. ఓ స్టార్ హీరో కొడుకు కూడా ఈ రేంజ్లో ఎంట్రీ ఇవ్వలేదు. పోనీ మొదటి చిత్రం కదా అని అనుకున్నా.. తరువాత తీసిన ఐదు సినిమాలకి ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు. కానీ ఇప్పుడు తను నటించిన ఆరో చిత్రానికి చాలా వరకూ మారినట్టే కనిపిస్తున్నాడు. శ్రీనివాస్… తేజ డైరెక్షన్లో ‘సీత’ అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం మే 24 న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలో భాగంగా.. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ” హీరో అంటే ఆరంభమే కనిపించాలి. ఇంట్రడక్షనే ఫైట్లు చేసేయాలి అనుకునేవాణ్ని. కానీ తేజగారితో పనిచేశాక అది తప్పని తెలుసుకున్నాను. మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ. కానీ దానిని ఎవరూ ప్రాక్టికల్గా చూపించలేదు. అందుకే ఆ లోటును తీర్చే కథతో సీత సినిమా చేశాం. టైటిల్ రోల్ చేసిన కాజల్ చాలా కష్టపడ్డారు. ఇక సోనూసూద్ అయితే ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశాడు. అనూప్ రుబెన్స్ ఆర్ ఆర్ తో మైమరిపించాడు. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ- ఆదరణ పొందడానికి జీవితాంతం ఇలాగే కష్టపడతాను. సినిమానే నాకు ప్రాణం. సినిమాకోసం నేను ఏమైనా చేస్తా. తేజగారిలాంటి ఫ్యాషనేట్ ఫిల్మ్ మేకర్ను నేను లైఫ్లో ఇప్పటివరకూ కలవలేదు. ఇలాంటి ప్యాషన్ ఉన్న డైరెక్టర్లను అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పనిచేస్తానని అనుకోలేదు. రఘురామ్ అనే ఛాలెంజింగ్ పాత్రతో మీ అందరినీ మెప్సిస్తాను. నా రోల్ తప్పకుండా సర్ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమా నాకు నటుడిగా మంచి గౌరవం తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నాను” అంటూ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడాడు. ఏదేమైనా ‘సీత’ చిత్రంతో కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలానే ఉన్నాడు ఈ యంగ్ హీరో.