Tyson Naidu: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్లో ఉన్న క్రేజీ హీరోల్లో ఒకరు. మంచి హైట్, ఫిజిక్ కలిగిన హీరో. ఇతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది. సినిమా కోసం చాలా కష్టపడతాడు.మేకోవర్ కూడా సూపర్ గా ఉంటుంది. సరైన హిట్లు రెండు పడితే.. టాప్ లీగ్ లో చేరిపోతాడు. అయినా ఇతనికి మంచి ఆఫర్లే వస్తుంటాయి. ఈ మధ్యనే హిందీలో ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాతలతో ‘ఛత్రపతి’ ని హిందీలో రీమేక్ చేశాడు. ఇతని వర్క్ కు ఇంప్రెస్ అయిపోయి ఆ చిత్రం నిర్మాతలు మరో రెండు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అయితే తనని ఆదరించిన తెలుగు ప్రేక్షకులను విడిచిపెట్టకూడదు అనే ఉద్దేశంతో వెంటనే తెలుగు సినిమా మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. 14 రీల్స్ ప్లస్ సంస్థ పై రామ్ ఆచంట, అనిల్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. మంచి ముహూర్తం చూసి టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. గతంలో చేయని ఇంట్రెస్టింగ్ రోల్ ను శ్రీనివాస్ ఈ చిత్రంలో చేస్తున్నాడట.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus