Bellamkonda Srinivas: చరణ్, తారక్ బెల్లంకొండకు మంచి స్నేహితులా.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు హీరోల సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఈ ఇద్దరు హీరోలు మళ్లీ కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఛత్రపతి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆది సినిమాకు మా నాన్నే ప్రొడ్యూసర్ అని తారక్ తో మంచి అనుబంధం ఉందని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు.

ఆది మూవీ పెద్ద హిట్ గా నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు. వినాయక్ సార్ తొలి మూవీ కూడా ఆది అని బెల్లంకొండ శ్రీనివాస్ కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, చరణ్ లతో మంచి ఫ్రెండ్ షిప్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా చరణ్, తారక్ లతో మంచి ఫ్రెండ్ షిప్ ఉందని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. చరణ్, తారక్ సినిమాలతో బిజీ కావడం వల్ల వాళ్లను కలవడం కుదరడం లేదని పేర్కొన్నారు.

చరణ్, తారక్ లతో కలిస్తే మేము చాలా సన్నిహితంగా ఉంటామని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్, చరణ్ పేర్లను ప్రస్తావించడం ద్వారా ఛత్రపతి సినిమాకు మేలు జరిగేలా బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహరించారు.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బెల్లంకొండ రెమ్యునరేషన్ పెరిగే అవకాశం ఉంది. (Bellamkonda Srinivas) బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్ హీరో బాలీవుడ్ లో సక్సెస్ సాధిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus