టాలీవుడ్ అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. అప్పట్లో ఇండియన్ సినిమా అనగానే వెంటనే బాలీవుడ్ పేరు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు పెరిగిన తెలుగు మార్కెట్ బాలీవుడ్ సినిమాలకు తక్కువేమి కాదు. ఒకప్పుడు సౌత్ అంటేనే చిన్నచూపు చూసేవారు. పైగా టాలీవుడ్ అంటే విలువిచ్చేవారు కాదు. కానీ మన దర్శకులు ఎప్పటికప్పుడు బాలీవుడ్ కు దీటుగా సినిమాలో చేస్తున్నారు. బాహుబలితో లెక్కలు మారిపోయాయి. ఇక ఆ తరువాత వచ్చిన సినిమాలు రాబోయే సినిమాలు కూడా బీ టౌన్ లో నెవర్ బిఫోర్ అనేలా రిలీజ్ అవుతాయి.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఛత్రపతి సినిమాకి రీమేక్ గా వస్తున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఛత్రపతి రీమేక్ కోసం చాలా వరకు బెల్లంకొండ తెలుగు పరిశ్రమను దూరం పెట్టేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఒక సినిమా ఆఫర్ వచ్చినా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదట. పూర్తిగా ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టినట్లు తెలుస్తోంది.
తెలుగులో మాంచి మార్కెట్ ఉన్న సమయంలో బెల్లంకొండ తెలుగు రీమేక్ గా బాలీవుడ్ కు వెళ్లడం సరైనదనే లేక రిస్క్ చేస్తున్నాడా అనే టాక్ వస్తోంది. మరి బెల్లంకొండ బాలీవుడ్ సినిమాతో అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో లేదో తెలియాలి అంటే మరికొన్ని నెలలు వేయిట్ చేయాల్సిందే.