నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల కనిపించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్..వంటివి సినిమా పై అంచనాలు పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సోగా అనిపించాయి.
కానీ అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ అయితే పర్వాలేదు అనిపించే విధంగా వస్తున్నాయి కానీ భారీ స్థాయిలో అయితే కాదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 14.78 cr |
సీడెడ్ | 10.01 cr |
ఉత్తరాంధ్ర | 3.99 cr |
ఈస్ట్ | 2.74 cr |
వెస్ట్ | 2.35 cr |
గుంటూరు | 4.79 cr |
కృష్ణా | 2.03 cr |
నెల్లూరు | 2.16 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 42.85 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.80 cr |
ఓవర్సీస్ | 6.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 52.65 cr (షేర్) |
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రానికి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ‘భగవంత్ కేసరి’ చిత్రం రూ.52.65 కోట్ల షేర్ ను రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ కి మరో రూ.8.35 కోట్ల షేర్ ను రాబట్టాలి. పోటీగా ‘లియో’ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు ఉండడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ స్లోగా ఉంది అని చెప్పాలి.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!