నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల కనిపించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్..వంటివి సినిమా పై అంచనాలు పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సోగా అనిపించాయి.
కానీ అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ అయితే పర్వాలేదు అనిపించే విధంగా నమోదయ్యాయి. కానీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 16.89 cr |
సీడెడ్ | 11.49 cr |
ఉత్తరాంధ్ర | 5.35 cr |
ఈస్ట్ | 3.07 cr |
వెస్ట్ | 2.59 cr |
గుంటూరు | 5.11 cr |
కృష్ణా | 2.35 cr |
నెల్లూరు | 2.43 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 49.28 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.52 cr |
ఓవర్సీస్ | 6.32 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 60.12 cr (షేర్) |
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రానికి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజులు పూర్తయ్యేసరికి ‘భగవంత్ కేసరి’ చిత్రం రూ.60.12 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.88 కోట్ల షేర్ ను రాబట్టాలి.
పోటీగా ‘లియో’ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు ఉండడం వల్ల ఈ సినిమా కాస్త స్లోగా పెర్ఫార్మ్ చేస్తుంది. కానీ ఈరోజుతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!