Sreeleela: శ్రీలీల కెరీర్ కి మైలేజ్ ఇచ్చే ‘భగవంత్ కేసరి’

శ్రీలీల.. ‘పెళ్ళిసందD’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం మొదటి షోతోనే మిక్స్డ్ రివ్యూస్ ను మూటగట్టుకుంది. టాక్ చాలా బ్యాడ్. అయినా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. అందుకు శ్రీలీల కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చిన ‘ధమాకా’ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ రెండు సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా సక్సెస్ అయ్యాయి అంటే అందుకు శ్రీలీల కూడా ఓ కారణమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే శ్రీలీల.. లక్కీ హీరోయిన్ గా ఓకే, మంచి డాన్సర్ గా ఓకే. కానీ మంచి నటిగా మంచి మార్కులు వేయించుకున్న సినిమా ఆమెకు ఇంకా పడలేదు అనే వెలితి ఉంది. కానీ ‘భగవంత్ కేసరి’ సినిమా ఆమెకి నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. విజ్జి పాప అనే పాత్రని ‘భగవంత్ కేసరి’ లో పోషించింది శ్రీలీల. ఈ సినిమా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా నటించే ఛాన్స్ ఈమెకి లభించింది.

ఆ అవకాశాన్ని చాలా వరకు సద్వినియోగపరుచుకుంది అనే చెప్పొచ్చు. (Sreeleela) శ్రీలీలకి ఆఫర్లకి అయితే కరువు లేదు. కేవలం నటిగా ప్రూవ్ చేసుకుంటే ఇంకా ఆమె ఫ్యూచర్ బాగుంటుంది అని అంతా అనుకున్నారు. అది ఆమెకు ‘భగవంత్ కేసరి’ రూపంలో వచ్చింది అని చెప్పొచ్చు. పైగా ఈ సినిమాలో ఫైట్స్ కూడా చేసింది ఈ బ్యూటీ.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus