Bhagavanth Kesari: అలా జరిగితే మాత్రం భగవంత్ కేసరి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కానుందా?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ నెల 19వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. థమన్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారని ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో బీజీఎం కూడా అదుర్స్ అనే రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో కాజల్ పాత్ర చనిపోతుందని భోగట్టా. కాజల్ పాత్ర చనిపోయిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా ఆ సెంటిమెంట్ ప్రకారం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాజల్ రేంజ్ సినిమా సినిమాకు పెరుగుతుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కాజల్ కు మరిన్ని మూవీ ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

భగవంత్ కేసరి సినిమా థియేట్రికల్ హక్కులు 80 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని సమాచారం. ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సులువుగానే సాధిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భగవంత్ కేసరి టైటిల్ కొత్తగా ఉండటంతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీలీల నటించడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది.

భగవంత్ కేసరి సక్సెస్ సాధిస్తే మాత్రం బాలయ్య హీరోగా శ్రీలీల కీలక పాత్రలో మరికొన్ని సినిమాల దిశగా అడుగులు పడుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఈ సినిమాలోని యాక్షన్ సీన్లతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని తెలుస్తోంది. బాలయ్య రేంజ్ ను మరింత పెంచే విధంగా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus