Bhagavanth Kesari: భగవంత్ కేసరి మూవీ థియేటర్ల లెక్క తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • October 18, 2023 / 10:31 PM IST

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1400 థియేటర్లలో విడుదలవుతోంది. బాలయ్య అభిమానులలో ఎక్కువమంది మొదటిరోజే ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. పోటీ ఉన్నా బాలయ్య సినిమాకు థియేటర్ల సంఖ్య తగ్గలేదు. అఖండ, వీరసింహారెడ్డి కంటే భగవంత్ కేసరి థియేటర్ల సంఖ్య తక్కువైనా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం థియేటర్ల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా తొలిరోజు 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా షేర్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. బాలయ్య, బాలయ్య ఫ్యాన్స్ కోరుకున్న హ్యాట్రిక్ ఈ సినిమా అందిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. భగవంత్ కేసరి బాలయ్య మార్క్ , అనిల్ రావిపూడి మార్క్ ను మిక్స్ చేసి ఉంటుందని ఈ సినిమాలోని ఫైట్ సీన్లు ఫ్యాన్స్ కు ఇచ్చే కిక్కు మామూలుగా ఉండదని తెలుస్తోంది.

కాజల్, శ్రీలీల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పిన విషయాలు ఫ్యాన్స్ ను ఎంతగానో మెప్పిస్తున్నాయి. బాలయ్య మాస్ ఇమేజ్ ను ఈ సినిమా మరింత పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీలీల ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సినిమాకు ఊహించని స్థాయిలో ప్లస్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమా (Bhagavanth Kesari) ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండనుందని తెలుస్తోంది.

నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న బాలకృష్ణ వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. భగవంత్ కేసరి పుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus