Bhagavanth Kesari: అమెజాన్ లో రాబోతున్న బాలయ్య భగవంత్ కేసరి!

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. బాలకృష్ణ, శ్రీ లీల, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ పరంగా ఎలాంటి కలెక్షన్స్ రాపడుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకరు ఈయన సినిమాలు ఇప్పటివరకు ఏవి కూడా నిర్మాతలకు నష్టాలను మిగిల్చలేదు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు మంచి టాక్ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా కలెక్షన్ల పరంగా సక్సెస్ అందుకోవాల్సి ఉంటుందని చెప్పాలి.

ఇక ఈ సినిమా (Bhagavanth Kesari) ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరలకు కొనుగోలు చేశారని ఈ సినిమాన విడుదలైన 50 రోజుల తర్వాత అమెజాన్ లో ప్రసారం చేయబోతున్నారని తెలుస్తుంది.

ఇలా 50 రోజుల తర్వాత అంటే ఈ సినిమా డిసెంబర్ రెండవ వారంలో అమెజాన్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. త్వరలోనే ఈ విషయాలకు సంబంధించి అమెజాన్ నుంచి పూర్తి అధికారిక ప్రకటన వెలబడుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీ లీల తండ్రి కూతురీ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus