Bhagavanth Kesari: టెన్షన్లో ‘భగవంత్ కేసరి’.. టీం, ఏమైందంటే..!

నందమూరి బాలకృష్ణ నుండి ఈ ఏడాది రాబోతున్న మరో మూవీ ‘భగవంత్ కేసరి’. అపజయమంటూ ఎరుగని అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. బాలయ్య కూడా ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్లతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కాబట్టి ‘భగవంత్ కేసరి’ పై అభిమానుల్లోనూ అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘షైన్ స్క్రీన్స్ ‘ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

టీజర్, ట్రైలర్స్ కి సూపర్ రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 19 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో రెడీ అవుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. ‘భగవంత్ కేసరి’ కి రన్ టైం సమస్యలు మొదలైనట్టు ఇన్సైడ్ టాక్. ఎందుకంటే ఈ చిత్రం (Bhagavanth Kesari) రన్ టైం ఏకంగా 163 నిమిషాలు అంటే 2 గంటల 43 నిమిషాల వరకు వచ్చినట్టు సమాచారం.

అందులోనూ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ డోస్ కూడా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. సో చిత్ర బృందం టెన్షన్లో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. అనిల్ రావిపూడి సినిమాలకు చాలా వరకు ఇదే సమస్య వస్తుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు తీసేయడం.. రిలీజ్ తర్వాత ఆ సన్నివేశాలను జోడించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus