ప్రముఖ నటి సోదరి అనుమానాస్పద మృతి!

ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారు.. 2023 ఏడాదిలో 3 నెలలు గడువకముందే కె. విశ్వనాథ్, జమున, వాణీ జయరాం, తారక రత్న, మలయాళీ యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్, టాలీవుడ్ కెమెరా మెన్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సతీష్ కౌశిక్, నటి మాధురి దీక్షిత్ తల్లి ఇటీవల మరణించారు.. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో మరణం సంభవించింది..

ప్రముఖ మరాఠీ నటి భాగ్యశ్రీ మోటే సోదరి మధు మార్కండేయ అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు. ఆమె మృతదేహం పూణేలోని పింప్రి-చించ్వాడ్‌లోని వాకాడ్‌లో లభ్యమైంది. ఆమె ముఖంపై గాయాలున్నాయి. కాగా మధు స్థానికంగా ఓ బేకరీ నడుపుతున్నారు. వ్యాపార పనుల నిమిత్తం ఓ గది అద్దెకు తీసుకునేందుకు వెళ్లిన ఆమె.. అక్కడ ఒక్కసారిగా తల తిరిగి పడిపోయారు. వెంట ఉన్న స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే మధు కుటుంబ సభ్యులు ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ఇది యాక్సిడెంటల్ డెత్‌ అని తేల్చారు. కేసు నమోదు చేశామని తదుపరి విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. మధు భర్త కూడా నెల రోజుల క్రితం ఆకస్మాత్తుగా చనిపోయారు. అంతలోనే సోదరి కూడా మరణించండంతో భాగ్యశ్రీ షాక్‌కి గురయ్యారు..

తన సోదరి మరణం గురించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ భాగ్యశ్రీ ఎమోషనల్ అయ్యారు.. ‘నన్ను వదిలేసి ఎలా వెళ్లగలిగావ్.. నువ్వు నా జీవితంలో భాగం.. ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు నీ బేబీ అన్ని చూసుకుంటుంది.. ప్రియ సోదరి ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికావ్.. నీ గురించి నేను మాటల్లో వర్ణించలేను.. సోదరిగా కాకుండా తల్లి, స్నేహితురాలివి అయ్యావ్.. నా జీవితానికి నువ్వే పునాది.. నువ్వు లేకుండా నేను లేను.. నువ్వు లేకుండా నేనేమీ చేయలేను.. నువ్వు కూడా నేర్పలేదు.. మరణం అనివార్యమని తెలిసినా.. నిన్ను మర్చిపోవడం సాధ్యం కాదు ఎప్పటికీ’ అంటూ ఎమోషనల్ అయ్యారు.. భాగ్యశ్రీ మోటే పలు సీరియల్స్, సినిమాలు చేశారు. హిందీ, మరాఠీ భాషల్లో సినిమాలు చేశారు. తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే సినిమాలో నటించారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus