మన కుర్రాళ్లకు ఓ హీరోయిన్ నచ్చింది అంటే తెగ ఆరాదించేస్తారు. ఆమెకు ఓ ముద్దు పేరు పెట్టుకుని మురిసిపోతుంటారు కూడా. అలా రీసెంట్‌గా ముద్దు పేరు సంపాదించుకున్న కథానాయిక భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) . ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమా ప్రచార చిత్రాలు, పాటలు వచ్చాక ఆమెను ‘నేషనల్ న్యూ క్రష్’ అని అంటున్నారు. ఈ విషయం ఆమె దగ్గర ప్రస్తావిస్తే భలేగా స్పందించింది.రవితేజ (Ravi Teja) హీరోగా హరీశ్ శంకర్ (Harish Shankar) తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’.
ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో భాగ్యశ్రీ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో చెప్పిన విషయాల్లోనిదే ఈ ‘నేషనల్ న్యూ క్రష్’ టాపిక్. యూత్ యువత మిమ్మల్ని ‘నేషనల్ న్యూ క్రష్’ అంటోంది కదా.. మీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే.. దాన్నో ప్రశంసలా తీసుకుంటున్నా అంటూ మురిసిపోతయింది. ఇక భలేగా డ్యాన్స్ చేస్తున్నారు ఏంటి సీక్రెట్ అని అడిగితే.. మా అమ్మ డ్యాన్స్ టీచర్. చాలా మందికి శిక్షణ ఇచ్చారు.
చిన్నతనంలో నేను కాస్త బొద్దుగా ఉండేదాన్ని. దాంతో డ్యాన్స్ చేయలేకపోయేదాన్ని. దీంతో చాలామంది నీకు డ్యాన్స్ రాదు అంటూ గేలి చేశారు. అప్పుడే పెద్దయ్యాక ఎలాగైనా మంచి డ్యాన్సర్ కావాలని నిర్ణయించుకున్నా. అలా డ్యాన్స్‌ను ఎంజాయ్ చేయడం తెలుసుకున్నా. ఇప్పుడు అలానే సినిమాలో డ్యాన్స్ చేశాను. ఇక సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ. బచ్చన్ (హీరో పాత్ర) జీవితంలో జిక్కీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ పాత్రనే నేను చేశాను.
సినిమాలో క్యాసెట్ రికార్డింగ్ షాప్ ప్రధానంగా ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ అవ్వగానే ‘నిన్ను చూసి గర్వపడుతున్నా’ అని దర్శకుడు హరీశ్ శంకర్ కాంప్లిమెంట్ ఇచ్చారని జిక్కీ అలియాస్ భాగ్యశ్రీ చెప్పింది. 1980ల్లో భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై జరిగిన ఇన్‌కమ్ ట్యాక్స్ దాడి బాలీవుడ్‌లో తీసిన ‘రైడ్’ అనే సినిమాకు రీమేకే ఈ ‘మిస్టర్ బచ్చన్’.