రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఈగ’ తర్వాత వరుస ఫ్లాప్ లతో కొన్నాళ్ళు సతమతమయ్యాడు నాని. ఈ నేపథ్యంలో ‘ఎవడే సుబ్రహ్మన్యం’ చిత్రం పర్వాలేదు అనిపించినా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీగా నిలువలేకపోయింది. ఇలాంటి టైంలో మారుతీ దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం అతనికి మంచి విజయాన్ని అందించింది. మతి మరుపు తో బాధపడే వ్యక్తి గా అతను ఈ చిత్రంలో చేసిన పెర్ఫార్మెన్స్ కు కలెక్షన్ల వర్షం కురిసింది. 2015 వ సంవత్సరం సెప్టెంబర్ 4 న ఈ చిత్రం విడుదల అయ్యింది. అంటే నేటితో 6 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
ఈ నేపథ్యంలో ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.10 cr |
సీడెడ్ | 2.10 cr |
ఉత్తరాంధ్ర | 2.15 cr |
ఈస్ట్ | 1.55 cr |
వెస్ట్ | 1.05 cr |
గుంటూరు | 1.65 cr |
కృష్ణా | 1.30 cr |
నెల్లూరు | 0.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 17.40 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.60 cr |
ఓవర్సీస్ | 6.11 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 27.11 cr |
‘భలే భలే మగాడివోయ్’ చిత్రానికి రూ.14.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.27.11 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే బయ్యర్లకు రూ.12 కోట్ల పైనే లాభాలు దక్కాయి.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!