నాకు చెప్పింది ఒకటి… తీసింది ఒకటి : భాను శ్రీ

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్2’ లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొని నిత్యం వివాదాలతో పాపులర్ అయ్యింది భాను శ్రీ రెడ్డి. హౌస్ లో కౌశల్ తో ఈమె ప్రవర్తించిన తీరుకి.. అతని పై సింపతీ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇక ఈ మధ్యనే విడుదలైన ‘ఏడు చేపల కథ’ సినిమా విషయంలో రాజకీయం చేసి తన పాత్రని తగ్గించింది .. నాకు అన్యాయం చేసింది అంటూ.. మేఘన చౌదరి.. బిగ్ బాస్ భాను శ్రీ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై తాజాగా భానుశ్రీ స్పందించింది.

Bhanu Sri Latest Photoshoot Still

ఆమె మాట్లాడుతూ… ‘ఏడు చేపల కథ’ సినిమా వల్ల నేను కూడా మోసపోయాను. నాకు డైరెక్టర్ చెప్పిన కథ ఒకటి… తీసింది మరొకటి. నాకు ఈ చిత్రంలో ఇన్ని బూతు సీన్లు ఉంటాయని తెలీదు. తెలిస్తే నేను అంగీకరించే దాన్నే కాదు. నేను ఎవర్నీ మోసం చేయలేదు .. చివరికి నేనే మోసపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది భాను శ్రీ.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus