మహేష్, కొరటాల మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే?

హ్యాట్రిక్ హిట్ అందుకున్న కొరటాల శివ  ఈ సారి పొలిటికల్ పంచ్ ఇవ్వడానికి రాజకీయ నేపథ్య కథ ఎంచుకున్నారు. మహేష్ బాబు ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. అందుకే కొరటాల శివతో చేస్తున్న సినిమాపై ఎక్కువగా శ్రద్ధ పెట్టారు. కొన్ని రోజుల క్రితం  హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సిఎం క్యాంప్ ఆఫీస్ సెట్లో కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ షెడ్యూల్  కి బ్రేక్ ఇచ్చి వాణిజ్య ప్రకటన షూటింగ్‌ కోసం మహేష్ యూరప్‌ వెళ్లారు. అటునుంచి అటే పిల్లలతో కలిసి  అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ దేశాలు తిరుగుతున్నారు. ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు అయిన డిస్నీల్యాండ్‌, టుమారోల్యాండ్, హాలీవుడ్‌ స్టూడియోలలో గౌతమ్, సితారలతో సరదాగా గడుపుతున్నారు. ఆ టూర్ నేటితో ముగుస్తుందని తెలిసింది. రేపు హైదరాబాద్ కి వస్తారట.

వెంటనే భరత్ అను నేను షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ తాజా షెడ్యూల్ నవంబర్ 23 నుంచి తమిళనాడు లోని పొల్లాచి లో మొదలు పెట్టనున్నారు. అక్కడే హొలీ నేపథ్యంలో ఓ భారీ ఫైట్ షూట్ చేయనున్నారు. ఈ యాక్షన్ సీన్ కొత్తగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. మహేష్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ కాంబో లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus