“బ్రహ్మోత్సవం, స్పైడర్” లాంటి డిజాస్టర్స్ అనంతరం మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం “భరత్ అనే నేను”. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తుండగా.. మహేష్ సరసన కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేయనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నారు. మహేష్ బాబుకి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం చాలా కీలకం. ఎందుకంటే ఈ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ తన తదుపరి చిత్రాల ఓపెనింగ్స్ మీద పడడమే కాదు తన బ్రాండ్ వేల్యూకి కూడా కీలకం కానుంది.
అందుకే “భరత్ అనే నేను” సినిమా ప్రమోషన్స్ విషయంలో కాస్త వైవిధ్యమైన పద్ధతులు ఫాలో అవుదామనుకొంటున్నారు. రెగ్యులర్ గా చేసినట్లుగా ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసేసి సైలెంట్ గా ఉండకుండా.. జనాల్లోకి వెళ్లాలని అనుకొంటున్నారట. మరో ఏడాదిన్నరలో ఎలక్షన్స్ వస్తుండడంతోపాటు.. మహేష్ బాబు, కొరటాల శివ ఎక్కువగా పబ్లిక్ ఈవెంట్స్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారట. రాష్ట్రాల సందర్శనను సినిమా ప్రమోషన్ కోసం వినియోగించుకోనున్నారు. ఆల్రెడీ ఆడియో టీజర్, పోస్టర్స్ తో క్రియేట్ అయిన బజ్ ని టీజర్, ఆడియోతో కంటిన్యూ చేయనున్నాడు మహేష్ బాబు. చూద్దాం మరి ఈ సరికొత్త ప్రమోషనల్ యాక్టివిటీ సినిమాకి ఏమేరకు హెల్ప్ అవుతుందో.