ప్రభుత్వాలపై సెటైర్ వేయనున్న మహేష్ తాజా చిత్రం భరత్ అనే నేను!

తమిళ చిత్రం మెర్సల్ కేంద్ర ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించి వివాదంలో నిలిచింది. ప్రజల మనసులు గెలుచుకొని విజయాన్ని అందుకుంది. అదిరింది అంటూ తెలుగులోనూ రిలీజ్ అయి ఇక్కడ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే తెలుగు వెర్షల్ లో కొన్ని డైలాగులు సెన్సార్ కి గురవడంతో  పూర్తి స్థాయిలో ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోయారు. అయితే ఆలోటును మహేష్ చిత్రం పూడ్చనుంది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న భరత్ అనే నేను సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందన్న విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విద్యావ్యవస్థలోని లొసుగులను ఎత్తి చూపిస్తారని, దీనికి సంబంధించిన సీక్వెన్స్ లు హైలెట్ గా నిలుస్తాయిని టాక్.

తమిళనాడు లోని పొల్లాచి లో గురువారం (ఈనెల 23 ) నుంచి భరత్ అను నేను మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.  హొలీ నేపథ్యంలో ఓ భారీ ఫైట్ షూట్ చేయనున్నారు.  భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం  ఏప్రిల్ 27 న థియేటర్లోకి రానుంది. మహేష్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ కాంబో లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus