ఇదివరకూ “అమ్మోరు, దేవిపుత్రుడు” లాంటి గ్రాఫిక్స్ ప్రధాన చిత్రానికి మాత్రమే వి.ఎఫ్.ఎక్స్ వాడేవారు. ఆ సినిమాకు గ్రాఫిక్స్ అవసరం కాబట్టి. కానీ.. ఈమధ్యకాలంలో ప్రతి సినిమాకి వి.ఎఫ్.ఎక్స్ అనేవి చాలా విరివిగా వాడుతున్నారు. “ఖలేజా” చిత్రంతో ఈ వి.ఎఫ్.ఎక్స్ యూసేజ్ బాగా పెరిగింది. “అత్తారింటికి దారేది” సినిమాకి యూజ్ చేసిన వి.ఎఫ్.ఎక్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు “భరత్ అనే నేను” గ్రాఫిక్స్ బ్రేక్ డౌన్ వీడియో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆదేస్థాయిలో ఆశ్చర్యపోతున్నారు.
సినిమాలో హోలీ ఫైట్ సీన్ ఉందంటూ సినిమా విడుదల ముందు నుంచీ హడావుడి చేసి అనంతరం రన్ టైమ్ ఎక్కువైందంటూ ఆ సీన్ ని ఎడిట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ సన్నివేశాన్ని యాడ్ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకూ ఆ సీన్ కి సంబంధించిన విజువల్స్ ఎక్కడా కనిపించలేదు. కట్ చేస్తే.. ఇవాళ విడుదల చేసిన వీడియోలో ఆ ఫైట్ కి సంబంధించి మహేష్ బాబు షాట్ ఒకటి కనిపించింది. ఆ షాట్ లో మహేష్ తన ముఖానికి రంగు పూసుకుంటున్నట్లుగా యాక్ట్ చేస్తుండగా.. వి.ఎఫ్.ఎక్స్ ద్వారా ఆ ముఖానికి పింక్ కలర్ వేశారు. ఎంత చంద్రుడితంతటి అందగాడైతే మాత్రం మరీ ఈరేంజ్ లో ముఖానికి రంగు కూడా వేసుకోనంటాడా? చెప్పండి.