కమల్ హాసన్ (Kamal Haasan) శంకర్ (Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు2 (Bharateeyudu 2) మూవీ రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలవుతోంది. తెలంగాణలో పెరిగిన టికెట్ రేట్లతో ఈ సినిమా విడుదలవుతుండగా ఏపీలో మాత్రం సాధారణ టికెట్ రేట్లతోనే విడుదలవుతూ ఉండటం గమనార్హం. భారతీయుడు2 మూవీ బుకింగ్స్ పరావలేదనే విధంగా ఉన్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా బుకింగ్స్ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్స్, ఏఏఏ సినిమాస్ లో మాత్రం భారతీయుడు2 బుకింగ్స్ కు సంబంధించి అదరగొడుతోందనే చెప్పాలి.
ఈ రెండు మల్టీప్లెక్స్ లలో 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో ఈ సినిమాకు భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం. భారతీయుడు2 సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 25 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. కమల్ హాసన్, శంకర్ కెరీర్ లను ఈ సినిమా డిసైడ్ చేయనుందని చెప్పవచ్చు. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా భారతీయుడు2 వింటేజ్ శంకర్ ను గుర్తు చేస్తుందేమో చూడాలి.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. భారతీయుడు2 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ కనిపించరని సిద్దార్థ్, రకుల్ పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని భోగట్టా. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం గారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా సాంగ్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సాంగ్స్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. భారతీయుడు2 సినిమా సక్సెస్ సాధిస్తే సినిమా ఇండస్ట్రీ మరింత కళకళలాడే అవకాశం అయితే ఉంది. కమల్, శంకర్ రేంజ్ ను ఈ సినిమా పెంచుతుందేమో చూడాలి.