Bharateeyudu 2 First Review: ‘భారతీయుడు 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ad not loaded.

కమల్ హాసన్  (Kamal Haasan) – శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996 లో వచ్చిన ‘భారతీయుడు'(తమిళంలో ఇండియన్) చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. హాస్పిటల్స్, ప్రభుత్వ ఆఫీసుల్లో జరిగే అవినీతి.. థీమ్ తో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారతీయుడు ఓ క్లాసిక్. అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి చిత్రానికి 28 ఏళ్ళ తర్వాత సీక్వెల్ వస్తుంది అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ జూలై 12 న రాబోతున్న ‘భారతీయుడు 2 ‘ (Bharateeyudu 2) పై కూడా అదే రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్స్ సినిమా పై ఆసక్తిని పెంచాయి. ‘కల్కి..’ హడావిడి కూడా కొంచెం తగ్గడం ‘భారతీయుడు 2’ కి కలిసొచ్చే అంశం. ఇక తాజాగా ఈ చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు ఉమైర్ సంధు. ఈ చిత్రాన్ని వీక్షించినట్టు చెప్పి తన అనుభవాన్ని తెలియజేశాడు. అతను ట్విట్టర్ ద్వారా ‘భారతీయుడు 2 ‘ పై స్పందిస్తూ.. ‘ఇది ఒక పైసా వసూల్ యాక్షన్ థ్రిల్లర్..పవర్ ఫుల్ మెసేజ్ ఉంది.

కమల్ హాసన్ తన నటనతో ఈ సినిమాకు జీవం పోశారు. 2024 లో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకునే సినిమాగా ‘భారతీయుడు 2′ ఉంటుంది’ అంటూ పేర్కొన్నాడు. ఉమైర్ సంధు ఎప్పుడూ ఫేక్ రివ్యూలు ఇస్తుంటాడు అనే సంగతి తెలిసిందే. ‘భారతీయుడు 2’ చిత్రాన్ని అయితే సెన్సార్ జరుగుతున్నప్పుడే చూసినట్టు అతను చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus