Bheemla Nayak: భీమ్లా ఫైట్ సీన్ ను అక్కడి నుంచి తీసుకున్నారా?

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ రిలీజయ్యే వరకు భీమ్లా నాయక్ కు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా ఒకరికొకరు పోటాపోటీగా నటించారు. మంగళవారం సెలవు కావడంతో భీమ్లా నాయక్ కు కలెక్షన్ల విషయంలో సెలవు రోజు ప్లస్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.

భీమ్లా నాయక్ లో మిగతా ఫైట్లతో పోల్చి చూస్తే క్లైమాక్స్ ఫైట్ హైలెట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. అయితే అయ్యప్పనుమ్ కోషియమ్ కు భీమ్లా నాయక్ కు క్లైమాక్స్ ఫైట్ విషయంలో కీలక మార్పు చేశారు. మాతృకలో అయ్యప్ప నాయర్ ప్రత్యర్థిని కౌగిలిలో బిగించి చంపడానికి ప్రయత్నిస్తారు. తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ రానా మెడపై కాలు పెట్టి కాలుతో తొక్కి పెట్టడం ద్వారా చంపడానికి ప్రయత్నిస్తారు.

అయితే రామాయణం నుంచి ఈ ఫైట్ సీన్ ను తీసుకున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. రామాయాణంలో వాలీ, సుగ్రీవుల మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన సన్నివేశం ఆధారంగా ఈ సీన్ ను తీర్చిదిద్దారని సమాచారం అందుతోంది. భీమ్లా నాయక్ సినిమాతో పవన్ ఖాతాలో మరో సక్సెస్ చేరడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం.

భీమ్లా నాయక్ ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు దర్శకుడు సాగర్ కె చంద్రకు ప్లస్ అయింది. ఫుల్ రన్ లో భీమ్లా నాయక్ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. రానాకు భీమ్లా నాయక్ సక్సెస్ తో ఆఫర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus