పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం ఈ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు నిర్మాతలకు భారీగా లాభాలను అందించాలి. అయితే ఏపీలో టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉండటం కొత్త టికెట్ల జీవో అమలులోకి రాకపోవడంతో భీమ్లా నాయక్ కు ఏపీలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.
Click Here To Watch NEW Trailer
కథ, కథనం బాగానే ఉన్నా ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత లేకపోవడం, ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే పాటలను తొలగించడం సినిమాకు మైనస్ అయింది. అయితే భీమ్లా నాయక్ ను తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించిన విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే భీమ్లా నాయక్ హిందీ వెర్షన్ ట్రైలర్ విడుదల కాగా అందులో రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. ఆ తర్వాత భీమ్లా నాయక్ హిందీ వెర్షన్ గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.
రేపటినుంచి భీమ్లా నాయక్ ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ హిందీ హక్కులను చాలారోజుల క్రితమే అమ్మేశారు. భీమ్లా నాయక్ హిందీ వెర్షన్ ను మేకర్స్ పక్కన పెట్టారేమోనని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. హిందీ వెర్షన్ లాభనష్టాలతో నిర్మాతలకు సంబంధం లేదని తెలుస్తోంది. అయ్యప్పనుమ్ కోషియమ్ హిందీలో రీమేక్ అవుతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ హిందీ వెర్షన్ రిలీజ్ ఆగిపోయిందని
ఈ సినిమా రిలీజ్ కు సమస్య ఇదేనని కూడా ప్రచారం జరుగుతోంది. భీమ్లా మేకర్స్ హిందీ వెర్షన్ గురించి క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓటీటీలో భీమ్లా నాయక్ రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రెండు ఓటీటీలలో ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఆయా ఓటీటీల సబ్ స్క్రైబర్లకు ప్రయోజనం చేకూరుతోంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!