పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంభాషణలు,స్క్రీన్ ప్లే ను అందించారు. ఫిబ్రవరి 25న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఆంధ్రలో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తున్నప్పటికీ ఈ చిత్రం తొలివారం భారీగా కలెక్ట్ చేసింది.అయితే రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకోవడంల్లో విఫలమయ్యింది. ఒకసారి 10 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
30.80 cr
సీడెడ్
10.65 cr
ఉత్తరాంధ్ర
7.18 cr
ఈస్ట్
5.32 cr
వెస్ట్
4.95 cr
గుంటూరు
5.02 cr
కృష్ణా
3.67 cr
నెల్లూరు
2.39 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
69.98 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
7.25 cr
ఓవర్సీస్
12.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
89.48 cr
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.89.48 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.20.52 కోట్ల షేర్ ను రాబట్టాలి. 10 వ రోజున ఈ చిత్రం బాగానే కలెక్ట్ చేసింది. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా చాలా ఉండడంతో ఇప్పుడు సందిగ్ధంలో పడింది.
ఆంధ్రాలో అంటే టికెట్ రేట్ల ఇష్యు కారణంగా కలెక్షన్స్ దెబ్బ తిన్నాయి అనుకోవచ్చు కానీ మిగిలిన ఏరియాల్లో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ చాలా డల్ అయ్యింది. మరి చివరికి బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి..!