Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ ట్రైలర్‌ ఈ పాయింట్‌ పవన్‌ ఫ్యాన్స్‌కి షాకింగ్‌!

‘భీమ్లా నాయక్‌’ ట్రైలర్‌ చూశారా? అలాగే ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ ట్రైలర్‌ చూశారా? అయితే ఈ వార్త చదవడాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ రెండింటిలో ఏదో ఒకటే చూసుంటే ఈ వార్త అంతగా అర్థం కాకపోవచ్చు. మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ ఆధారంగానే ‘భీమ్లా నాయక్‌’ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో కొన్ని మార్పులు జరిగాయి అని టాక్‌. ట్రైలర్‌ చూసినవాళ్లకు ఈ విషయంలో అంతోకొంతో క్లారిటీ వచ్చింది.

Click Here To Watch

అయితే రెండు ట్రైలర్లను కంపేర్‌ చేస్తే మాత్రం చాలా విషయాలు తెలుస్తాయి. ‘భీమ్లా నాయక్‌’, ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ ట్రైలర్లను మరీ ఫ్రేమ్‌ టు ప్రేమ్‌ మేం చూడటం లేదు కానీ… ఓవరాల్‌గా రెండు ట్రైలర్లను కంపేర్‌ చేస్తున్నాం. అలా చూస్తేనే పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యే చాలా అంశాలు కనిపిస్తున్నాయి. రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు. ‘భీమ్లా నాయక్‌’ ట్రైలర్‌ చూస్తుంటే దాని పేరు ‘డానియల్‌ శేఖర్‌’ అని పెడితే బాగుండు అని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

నిజానికి కొంతమంది ఫ్యాన్స్‌ కూడా ఇదే మాట అంటున్నారు. ‘భీమ్లా నాయక్‌’ ట్రైలర్‌ రానా వాయిస్‌తో ప్రారంభమవుతుంది. అదే ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ బిజూ మేనన్‌ వాయిస్‌తో ప్రారంభమవుతుంది. ‘భీమ్లా..’ ట్రైలర్‌లో రానానే ఎక్కువగా కనిపిస్తాడు. వాయిస్‌ కూడా అతనిదే కమాండింగ్‌గా ఉంటుంది. అదే ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’లో అయితే ఇద్దరికీ సమానంగా స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఉంటుంది. దీంతో ‘భీమ్లా నాయక్‌’ ట్రైలర్‌ ‘డేనియల్‌ శేఖర్‌’ ట్రైలర్‌లా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

మీరు ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ ట్రైలర్‌ కావాలంటే మరోసారి చూడండి. బిజూ మేనన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాత్రలు సమానంగా ఉంటాయి. సినిమాలోనూ అలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ‘భీమ్లా నాయక్‌’ ట్రైలర్‌ దగ్గరకు వచ్చేసరికి ఆ బ్యాలెన్స్‌ మిస్‌ అయ్యింది అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు. గత కొద్ది రోజులుగా ‘భీమ్లా నాయక్‌’ సినిమాలో రానా పాత్ర తక్కువ చేస్తున్నారు అంటూ వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ట్రైలర్‌లో రానా హైలైట్‌ అవ్వడంతో ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడుతుందో లేదో చూడాలి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus