Sharwanand: అలా అయితే మళ్ళీ ‘భీమ్లా నాయక్’ పోస్ట్ పోన్ అయినట్టే..!

పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రం జనవరి 12న విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. కానీ ‘రాధే శ్యామ్’ ‘ఆర్.ఆర్.ఆర్’ టీంల ప్రపోజల్ కారణంగా వెనక్కి తగ్గి ఫిబ్ర‌వ‌రి 25కు షెడ్యూల్ చేసుకున్నారు. అయితే ‘రాధే శ్యామ్’ ‘ఆర్.ఆర్.ఆర్’ లు కూడా రిలీజ్ అయ్యింది ఏమీ లేదు.. మరో పక్క కోవిడ్ కేసులు ఎక్కువ పెరుగుతున్నప్పటికీ ప్రాణ హాని వంటివి ఎక్కువ సంభవించడం లేదు. ఫిబ్రవరికి కరోనా ఆంక్షలు తొలగిపోయి అంతా నార్మల్ స్టేజికి వచ్చేస్తుంది పరిస్థితి అని అంతా ధీమాగా ఉన్నారు.

ఈ క్రమంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ య‌ధావిధిగా ఫిబ్రవరి 25నే రిలీజ‌వుతుంద‌ని అంతా ఆశ‌ పడ్డారు. నిర్మాత‌లు కూడా వాయిదా వేస్తున్నట్టు ప్ర‌క‌టించింది ఏమీ లేదు. కానీ ‘భీమ్లా’ రిలీజ్ పై మళ్ళీ సందేహాలు నెలకొన్నాయి. అందుకు కారణం శ‌ర్వానంద్ కొత్త మూవీ ‘ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’ ఫిబ్రవరి 25న విడుదలవుతుంది అని ప్రకటన రావడం వల్లనే.దానికి సంబంధించిన ఓ పోస్ట‌ర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

అదే డేట్ కు ‘భీమ్లా నాయ‌క్’ వస్తుందని తెలిసి వాళ్ళు ధైర్యం చేసే అవకాశం లేదు. పోనీ ఆ డేట్ కు ‘భీమ్లా’ ని పోస్ట్ పోన్ చేసుకోమనేంతపెద్ద సినిమా కూడా కాదు..!కాబట్టి వెనుక ఏదో జరుగుతుంది. ‘భీమ్లా నాయక్’ ఆ డేట్ కు వచ్చే అవకాశాలు లేవు. మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనవరి 12న రిలీజ్ అవుతుందని డిసెంబర్ మొత్తం హడావిడి చేసిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’..

ఇప్పుడు ఫిబ్రవరి 25 విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంది. ఇక ఫిబ్రవరి 25న కాకపోతే ‘భీమ్లా’ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈ విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus