Bheems: మొత్తానికి హిట్టు కొట్టాడు.. మరి స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తారా..?

స్టార్ హీరోలు నటించే సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ లేదా దేవిశ్రీప్రసాద్ ను ఫిక్స్ చేస్తారు. టాలీవుడ్ లో వీరిద్దరే టాప్ పొజిషన్ లో ఉండడంతో అవకాశాలన్నీ వీరికే వస్తున్నాయి. వీరి తరువాత స్థానంలో అంటే అనూప్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కొందరు ఉన్నారు. కానీ వీరు పెద్ద సినిమాలకు ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ‘ధమాకా’ సినిమాకి భీమ్స్ అందించిన మ్యూజిక్ సినిమా సక్సెస్ కి ఎంతగా దోహదపడ్డాయో తెలిసిందే.

యూట్యూబ్ లో ఈ పాటలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. ఇదివరకు రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు రానంత క్రేజ్ ‘ధమాకా’ సినిమాతో సంపాదించారు భీమ్స్. సినిమాలో జింతాక జింతాక, దండకడియాల్ పాటలు మాస్ కి బాగా రీచ్ అయ్యాయి. పల్సర్ బైక్ సాంగ్ ఒరిజినల్ ట్యూన్ కాకపోయినా.. దాన్ని రీమేక్స్ చేసి తెరకెక్కించిన విధానం బాగుంది. రిలీజ్ కు ముందు రవితేజ.. భీమ్స్ గురించి గొప్పగా చెబితే, ఇలా చెప్పడం మాములే అని అనుకున్నారు.

కానీ ఇన్నేళ్ల తరువాత కూడా అతడి ప్రతిభను నమ్మి రవితేజ ఛాన్స్ ఇచ్చినందుకు మంచి ఆల్బమ్ అందించారు భీమ్స్. 2012లో ‘నువ్వా నేనా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భీమ్స్ కి ఇంతకాలానికి చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్టు దొరికింది. రవితేజ నెక్స్ట్ సినిమా ‘రావణాసుర’కి కూడా హర్షవర్ధన్ తో కలిసి భీమ్స్ పాటలు ఇవ్వబోతున్నారు. ఈ మధ్యకాలంలో మాస్ ఆడియన్స్ ను అలరించే ఆల్బమ్స్ రావడం బాగా తగ్గింది.

‘ధమాకా’ సినిమా ఇంతగా జనాలకు రీచ్ అవ్వడానికి కారణం కామెడీతో పాటు స్క్రీన్ మీద అదరగొట్టిన పాటలనే చెప్పాలి. ఆ పాటలకు తన ఎనర్జీతో మ్యాచ్ చేసే స్టెప్స్ వేస్తూ రవితేజ మరింత హైలైట్ అయ్యేలా చేశారు. శ్రీలీల డాన్స్ పెర్ఫార్మన్స్ లు కూడా అదిరిపోయాయి. భీమ్స్ ఇదే దూకుడుని కొనసాగిస్తే ఫ్యూచర్ లో మరిన్ని పెద్ద ప్రాజెక్ట్స్ చేసే ఛాన్స్ ఉంటుంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus