నితిన్‌ సెల్ఫ్‌ సెటైర్లు.. రష్మిక క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్లు.. భలే ఉంది అనౌన్స్‌మెంట్‌!

సినిమా చేయడం ఒక కళ.. అది అందరికీ రాదు. ఏంటీ తెలిసిన విషయమే మళ్లీ చెబుతున్నాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇదే మాటను మరోలా చెబుదామా? ‘సినిమాను ప్రచారం చేయడం ఓ కళ.. అది అందరికీ రాదు.. వచ్చినా వర్కౌట్‌ అవ్వదు’. బాగుంది కదా ఈ మాట. ఇప్పుడు దీనినే చాలామంది ఫాలో అవుతూ సినిమా అనౌన్స్‌మెంట్‌ అదిరిపోయే రేంజిలో చేస్తున్నారు. అచ్చంగి ఇలాంటి ప్రయత్నమే చేశారు VNR. అంటే వెంకీ కుడుముల, నితిన్‌, రష్మిక మందన. ‘భీష్మ’ సినిమాతో గతంలో అదరగొట్టిన ఈ ట్రయో ఇప్పుడు మళ్లీ వస్తోంది.

2020లో వచ్చిన ‘భీష్మ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. వెంకీ, నితిన్‌, రష్మిక. ఇప్పుడు మరోసారి ముగ్గురూ కలసి సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా తర్వాత రష్మిక.. పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయ్యి, ఆ తర్వాత నేషనల్‌ క్రష్‌ అయిపోయింది. మరోవైపు నితిన్‌ ఆ విజయాన్ని క్యాష్‌ చేసుకోలేక వరుస ఫ్లాప్‌లు ఇస్తూ వచ్చాడు. ఇక వెంకీ కుడుముల అయితే మరో సినిమాను ఓకే చేసుకోలేకపోయారు. ఈ మూడు విషయాల్ని కలిపి ఓ సెటైరికల్‌ వీడియో చేసి.. సినిమాను అనౌన్స్‌ చేశారు.

వినడానికే అదిరిపోయిన ఈ మాటలు, ఆలోచనలు.. చూడటానికి కూడా బాగున్నాయి. ఉగాది సందర్భంగా విడుదల చేసి ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రకటన వీడియోను ఒక గమనికతో మొదలుపెట్టారు. ‘ఎవరి మనోభావాలు మేం దెబ్బతీయట్లేదు. మా మనోభావాలు మేమే దెబ్బతీసుకుంటున్నాం. ధన్యవాదాలు’ అని నితిన్ తెలుగులో, రష్మిక మందన ఇంగ్లిష్‌లో చెప్పి వీడియోను మొదలుపెట్టారు. దీంతో వీడియో అంతా సెటైర్‌లతో నిండిపోతుందని ముందే చెప్పేశారు.

‘ ఇంకా ఎవరూ రాలేదా’ అంటూ అప్పుడే వచ్చిన నితిన్‌ మేనేజర్‌ను అడుగుతారు. ‘హీరోయిన్ మార్నింగ్ 8 గంటలకే వచ్చేశారు సార్’ అంటాడు మేనేజర్‌. ‘సేమ్ హీరోయినా’ అని చిన్నగా అడుగుతారు నితిన్. ‘సేమే.. ఏ డౌటా?’ అంటూ ఎంట్రీ ఇస్తుంది రష్మిక. ‘అస్సలు లేదమ్మా.. మన డైరెక్టర్ స్క్రిప్ట్‌లో ఓం రాసేముందు నీ పేరే రాస్తాడు’ అంటూ సెటైర్ వేశారు నితిన్. ఉదయాన్నే వచ్చి ఏం చేస్తున్నావ్‌ అని నితిన్‌ అడిగితే.. ‘ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌’లో ఉన్నాను అని నగరాల పేర్లు చెబుతుంది. ‘నువ్వు నేషనల్‌ క్రష్‌వి’ అంటూ నితిన్‌ పొగిడేస్తాడు.

‘ఓన్లీ మాటలేనా.. కాంట్రవర్శీలు కూడా ఉన్నాయా’ అని నితిన్‌ అడిగితే.. ‘ఆ మాట ఎత్తొద్దు.. నేను ఒక మాట అంటే రెండు, మూడు కాంట్రవర్శీలు వస్తున్నాయి’ అని రష్మిక అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ సినిమా చేస్తున్నాం కదా అంటూ పంచ్‌ ఇచ్చుకుంటారు. ఇలా ఇద్దరి మధ్య చాలా కామెడీ పంచ్‌లు, సెల్ఫ్‌ సెటైర్లు ఉన్నాయి. వాటికి రష్మిక క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్లు ప్లస్‌. ఆ వీడియో మొత్తం చూస్తే ఇంకాస్త మజా వస్తుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus