Bhimaa Collections: ‘భీమా’ 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

గోపీచంద్(Gopichand), కన్నడ దర్శకుడు ఎ.హర్ష(Harsha) కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘భీమా'(Bhimaa). ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్.. కాకపోతే కొంచెం సోసియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమా. గోపీచంద్ సరసన మాళవిక శర్మ(Malvika Sharma), ప్రియా భవానీ శంకర్(Priya Bhavani Shankar).. లు హీరోయిన్లుగా నటించారు. ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ బ్యానర్‌పై కెకె రాధామోహన్ (K. K. Radhamohan)ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 8న అంటే శివరాత్రి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ ను సాధించింది. రెండో వీకెండ్ కి కూడా పర్వాలేదు అనిపించింది.ఇక 11 వ రోజు రెండో సోమవారం రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.79 cr
సీడెడ్ 1.13 cr
ఉత్తరాంధ్ర 0.79 cr
ఈస్ట్ 0.44 cr
వెస్ట్ 0.35 cr
గుంటూరు 0.69 cr
కృష్ణా 0.75 cr
నెల్లూరు 0.44 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.36 cr
 ఓవర్సీస్ 0.38 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 8.12 cr (షేర్)

‘భీమా’ చిత్రానికి రూ.10.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.11 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.8.12 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.88 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus