దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 2026 సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.మారి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. వాస్తవానికి 2022 లో మొదలైన సినిమా ఇది. కానీ మధ్యలో ఆగిపోయింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు.
మొత్తానికి మారి ఎంట్రీతో మళ్ళీ మొదలైంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో నిర్మాత నాగవంశీ బ్యానర్లో ఫాస్ట్ గా రూపొందుతున్న సినిమా ఇదే అని చెప్పాలి. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. అప్పుడే ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేయడం జరిగింది.

‘భీమవరం బల్మా’ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ 3 నిమిషాల 9 సెకన్ల నిడివి కలిగి ఉంది. సంక్రాంతికి వస్తున్న సినిమా కాబట్టి.. ఆ పండుగ వైబ్ వచ్చేలా ఈ పాటని డిజైన్ చేసినట్టు స్పష్టమవుతుంది. మిక్కీ జె మేయర్ అందించిన ట్యూన్ రెగ్యులర్ గానే ఉంది. తన ‘మిస్టర్’ సినిమాలోని ట్యూన్ మాదిరే ఉంది. అయితే ఈ పాటని హీరో నవీన్ పోలిశెట్టి పాడటం అనేది వినడానికి కొత్తగా అనిపిస్తుంది.
అంతేకాదు మొదటిసారి ఈ పాటలో అతను ఫాస్ట్ గా డాన్స్ చేశాడు. అది కూడా ఒక విశేషమే.హీరోయిన్ మీనాక్షి చౌదరి, నవీన్..ల కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది. ఈ పాటకి ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ అంటే లిరిక్స్ అనే చెప్పాలి. భీమవరం జనాలను అలాగే జెంజి కిడ్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రబోస్ సాహిత్యం సమకూర్చినట్టు స్పష్టమవుతుంది. ఇక ఈ లిరికల్ సాంగ్ ను మీరు కూడా ఓ లుక్కేయండి
