Bhola Shankar Release Date: అదిరిపోయే అప్డేట్ తో ఖుషి అవుతున్న మెగా ఫ్యాన్స్!

ఆచార్య సినిమా ద్వారా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవం ఎదురయింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం సందడి చేయలేక బాక్స్ ఆఫీస్ వద్ద చేతికల పడిపోయింది.ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మెగాస్టార్ నటిస్తున్న తదుపరి చిత్రాలు గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ఈ దసరా కానుక విడుదల చేయడం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఈయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించినటువంటి చిత్రం భోళా శంకర్. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా సందడి చేయగా, చిరంజీవి చెల్లెలు పాత్రలో నటి కీర్తి సురేష్ సందడి చేయనున్నారు. ఇలా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీ విడుదల కాబోతుందని మేకర్స్ విడుదల తేదీన ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.

ఈ క్రమంలోనే ఈ పోస్టర్ వైరల్ కావడంతో మెగా అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇంద్ర సినిమాని తిరిగి విడుదల చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. అలాగే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus