ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలకు టికెట్ రేట్లను పెంచడం సాధారణంగా జరుగుతోంది. బ్రో మినహా దాదాపుగా అన్ని భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెరిగాయి. చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ సినిమాకు కూడా టికెట్ రేట్ల పెంపు ఉండబోతుందని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈ సినిమా బుకింగ్స్ మొదలు కాగా టికెట్ రేట్ల పెంపు కొలిక్కి వస్తే మిగతా ఏరియాల్లో సైతం ఈ సినిమా బుకింగ్స్ మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది.
25 రూపాయలు పెంచేలా నిర్మాతలు అప్లికేషన్ పెట్టుకున్నారని భోగట్టా. అయితే టికెట్ రేట్లను పెంచితే మెగా ఫ్యాన్స్ కు ఒకింత ఇబ్బందేనని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ రేట్ల పెంపు సరైన నిర్ణయం కాదని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అయితే ఏపీలో మాత్రమే టికెట్ రేట్ల పెంపు ఉండబోతుందని సమాచారం. తెలంగాణతో పోలిస్తే ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో టికెట్ రేట్ల పెంపు దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.
అయితే టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. భోళా శంకర్ సినిమాకు పోటీగా పలు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే టికెట్ రేట్లను పెంచినా సమస్య ఉండదు. భోళా శంకర్ సినిమాకు చిరంజీవి కొత్త తరహాలో ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించి అంచనాలు పెంచడంలో చిరంజీవి సక్సెస్ అయ్యారు.
భోళా శంకర్ (Bhola Shankar) మూవీ కోసం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చైందని తెలుస్తోంది. తమన్నా, కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించగా ఇద్దరి పాత్రలకు సమ ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. భోళా శంకర్ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ ఈ సినిమా ఫలితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!