Bhola Shankar: మెగా అభిమానులను టెన్షన్ పెట్టే న్యూస్ ఇది..!

  • June 9, 2023 / 06:34 PM IST

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాత. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.నిజానికి సమ్మర్ కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఆగస్టు 11 కి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా చేస్తుండగా.. చిరుకి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.

యంగ్ హీరో సుశాంత్ .. కీర్తి సురేష్ పాత్రకి బాయ్ ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆగస్టు 11 న ‘భోళా శంకర్’ మూవీ రిలీజ్ అవుతుంది అని నిర్మాతలు ఆల్రెడీ ప్రకటించారు. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ అయ్యింది. కానీ ఈ మూవీ ఆ డేట్ కి రిలీజ్ కాకపోవచ్చు అనేది ఇన్సైడ్ టాక్.

ఎందుకంటే ‘భోళా శంకర్’ (Bhola Shankar) చిత్రానికి సంబంధించి సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అలాగే రెండు పాటల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. అది ఆగస్టు లోపు కంప్లీట్ చేయడం కొంచెం కష్టమైన పని. అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మిస్ అయితే చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22 టైంకి ‘భోళా శంకర్’ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు టాక్.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus