Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

‘విశ్వంభర’ సినిమా ఏకంగా ఏడాదిన్నర పాటు వెనక్కి వెళ్ళింది. వినడానికి కష్టంగా ఉన్నా.. ఇది. ఈ ఏడాది అంటే 2025 జనవరి 10నే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కానీ ‘గేమ్ ఛేంజర్’ కోసం వాయిదా వేసినట్టు కవర్ చేసుకున్నారు. కానీ తర్వాత విషయం అందరికీ అర్థమైంది. గ్లింప్స్ లో వి.ఎఫ్.ఎక్స్ చాలా నాసిరకంగా ఉంది. ‘సింతాల్ సోప్’ ‘మౌంటైన్ డ్యూ’ యాడ్స్ లా విజువల్స్ ఉన్నాయి అంటూ నెటిజన్లు ట్రోల్ చేసి పడేశారు.

Vishwambhara

‘చిరంజీవి వంటి స్టార్ హీరో నటించిన ఈ సినిమాలో ఇంత నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ ఏంటి?’ అంటూ క్రిటిక్స్ సైతం పెదవి విరిచారు. దీంతో వి.ఎఫ్.ఎక్స్ విషయంలో ‘విశ్వంభర’ టీం జాగ్రత్త పడేందుకు సిద్ధమైంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఇప్పటివరకు 3 వి.ఎఫ్.ఎక్స్ కంపెనీలతో పని చేయించుకుంది. అయినా ఔట్పుట్ సంతృప్తి కరంగా రాలేదు అని ఇన్సైడ్. మరోపక్క బిజినెస్ కూడా పూర్తి కాలేదు.

దీంతో అనిల్ రావిపూడి సినిమాని ముందు సీన్లోకి దింపి.. దాని రిజల్ట్ తో ‘విశ్వంభర’ని బయ్యర్స్ కి, ఓటీటీ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అవును ‘విశ్వంభర’ పై నిర్మాతలు రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ మొత్తాన్ని వెనక్కి రప్పించాలి అంటే అనిల్ రావిపూడి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రాన్ని అడ్డం పెట్టుకోక తప్పదు. సంక్రాంతికి వస్తుంది కాబట్టి.. కచ్చితంగా ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుంది.

ఆ సినిమా రైట్స్ సేల్ అవ్వాలి అంటే ‘విశ్వంభర’ కూడా కొనాలి అనే కండిషన్ పెడతారు. ‘భోళా శంకర్’ విషయంలో కూడా ఇదే జరిగింది. ‘వాల్తేరు వీరయ్య’ కంటెంట్ పై నమ్మకంతో చిరు ముందుగా ఆ చిత్రాన్ని రంగంలోకి దించారు. ఆ తర్వాత ‘భోళా శంకర్’ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని అర్ధం చేసుకోవచ్చు.

నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus