తెలుగులో అనుష్క స్టార్ డమ్ ను, నట ప్రతిభను ప్రేక్షకులకు మరోసారి గుర్తుచేసిన సినిమా “భాగమతి”. హారర్ థ్రిల్లర్ అనుకుంటే.. క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులని కూడా విశేషంగా ఆశ్చర్యపరిచిన ఆ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడంతో.. ఈ సినిమాను మరో భాషలో రీమేక్ చేయడానికి ఆలోచించారు నిర్మాతలు. ఇప్పుడు అనుష్క “అరుంధతి” చిత్రాన్ని బాలీవుడ్ లో కరీనా కపూర్ హీరోయిన్ గా రీమేక్ చేస్తుండడంతో.. అనుష్క మరో క్రేజీ హిట్ “భాగమతి” చిత్రాన్ని కూడా బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
హిందీలో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఎవరు నిర్మిస్తారు అనే క్లారిటీ లేదు కానీ.. హీరోయిన్ గా మాత్రం “దమ్ లాగాకే హైస్సా, లస్ట్ స్టోరీస్” ఫేమ్ భూమీ పడ్నేకర్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి.
బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?